News October 27, 2024
పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు పార్థిబన్ భేటీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్థిబన్ దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
Similar News
News March 19, 2025
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు

*1681- ముంబై ఇండియన్స్
*1649- ఆర్సీబీ
*1513- పంజాబ్ కింగ్స్
*1508- చెన్నై సూపర్ కింగ్స్
*1492- కేకేఆర్
*1348- ఢిల్లీ క్యాపిటల్స్
*1235- రాజస్థాన్
*1038- సన్‌రైజర్స్ హైదరాబాద్ *400- డెక్కన్ ఛార్జర్స్
*332- లక్నో *270- గుజరాత్ టైటాన్స్
News March 19, 2025
ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంపు

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్‌డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.
News March 19, 2025
10,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్స్

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 10,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్‌లోనే దాదాపు 18వేల మందికి లేఆఫ్స్ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు మరోసారి ఉద్యోగాలకు కోత విధించనుంది. దీనిని పలువురు టెక్ నిపుణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. AI టెక్నాలజీ రావడంతో పలు ఐటీ సంస్థలు భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.