News October 27, 2024
ఫాంహౌస్ పార్టీ.. DGPకి కేసీఆర్ ఫోన్

TG: జన్వాడ <<14465898>>ఫాంహౌస్<<>> పార్టీపై BRS అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర విల్లాల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు. కాగా, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 26, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ₹2,450 పెరిగి రూ.1,62,710కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ₹2,250 ఎగబాకి రూ.1,49,150 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర ₹69వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 26, 2026
టీ20 వరల్డ్‌కప్ సమావేశంలో BCB ఛైర్మన్ అసహనం!

T20 WC విషయంలో ICCతో జరిగిన సమావేశంలో BCB ఛైర్మన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల సాకుతో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన విషయం తెలిసిందే. 3 వారాల పాటు చర్చలు సాగినప్పటికీ ఆ ప్రతిపాదనను ICC తిరస్కరించింది. చివరకు బంగ్లాను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో BCB ఛైర్మన్ అమినుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
News January 26, 2026
కొత్త మూవీ.. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ

మాస్ మహారాజా రవితేజ రూటు మార్చారు. అయ్యప్పస్వామి భక్తుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. రవితేజ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్‌ను ‘ఇరుముడి’గా పేర్కొంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి ఎమోషన్ ఒక సెలబ్రేషన్’ అని పేర్కొన్నారు. తలపై ఇరుముడితో చిన్నారిని ఎత్తుకొని ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.


