News October 27, 2024
కాంగ్రెస్ ప్రభుత్వానివి చౌకబారు రాజకీయాలు: హరీశ్ రావు
TG: ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కొనలేనప్పుడే కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీని ఉద్దేశించి తమ పార్టీని నేరుగా ఎదుర్కోలేని కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ ‘మొహబ్బత్ కా దుకాణ్’ అసలైన రూపం బయటపడిందని దుయ్యబట్టారు.
Similar News
News November 1, 2024
GST Collections: అక్టోబర్‌లో భారీగా వసూళ్లు
Oct జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 9 శాతం వృద్ధి నమోదైంది. ఈ మొత్తంలో ఎస్జీఎస్టీ రూ.41 వేల కోట్లు, సీజీఎస్టీ రూ.33 వేల కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.99 వేల కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో రూ.12 వేల కోట్లు వసూలయ్యాయి. ఈ వృద్ధి పండుగ సీజన్‌లో అమ్మకాలు, పన్ను చెల్లింపుల వల్లే సాధ్యమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
News November 1, 2024
ఎగబడి కొన్నారు.. అంతలోనే వదిలేశారు..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను గత ఐపీఎల్ వేలంలో KKR ఎగబడి మరీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.24.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ పట్టుమని పది నెలలు కూడా గడవకముందే అతడిని వదిలేసింది. గత సీజన్‌లో ఫెయిల్ కావడం వల్లే ఆ ఫ్రాంచైజీ వదిలేసినట్లు టాక్. కాగా ఈ నెలలో జరగబోయే మెగా వేలంలో స్టార్క్‌ను దక్కించుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
News November 1, 2024
జేఎంఎం మొత్తం ఓ నకిలీ వ్యవస్థ: హిమంత బిశ్వ
ఝార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఓ నకిలీ వ్యవస్థ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. CM హేమంత్ సోరెన్ వయసుపై వివాదం రేగడంపై ఆయన స్పందించారు. ‘JMM వ్యవస్థ మొత్తం నకిలీ. అఫిడవిట్‌ను పరిశీలిస్తే సోరెన్ వయసు కూడా పెరిగింది. ఇది చొరబాటుదారుల ప్రభుత్వం. JMMను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు. ప్రజలు బాధ్యతగా వారిని గద్దెదించాలి’ అని శర్మ పిలుపునిచ్చారు.