News October 27, 2024
ఎల్లుండి ఉ.10 గంటల నుంచి..

AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు.
Similar News
News November 15, 2025
17 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం

AP: చరిత్ర తిరగరాసేలా విశాఖ సీఐఐ సదస్సు సూపర్ హిట్టయ్యిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘613 ఒప్పందాల ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దేశవిదేశాల నుంచి సమ్మిట్‌లో 5,587 మంది ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తంగా 17 నెలల్లోనే రూ.20 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు సాధించాం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం’ అని తెలిపారు.
News November 15, 2025
ఈషాసింగ్‌కు CM రేవంత్ అభినందనలు

TG: కైరో(EGYPT)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈషాసింగ్‌కు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తూ ఈషాసింగ్ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు CMO ట్వీట్ చేసింది.
News November 15, 2025
iBOMMA నిర్వాహకుడికి నెటిజన్ల సపోర్ట్.. ఎందుకిలా?

పోలీసులు అరెస్టు చేసిన iBOMMA నిర్వాహకుడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని చాలా మందికి ఇటువంటి సైట్లే దిక్కంటున్నారు. OTT సబ్‌స్క్రిప్షన్ ధరలూ భారీగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అతడు చట్టవిరుద్ధమైన పైరసీతో ఇండస్ట్రీకి భారీగా నష్టం చేస్తున్నాడని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.కోట్ల ఆదాయం పొందుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మీ COMMENT?


