News October 27, 2024

భారత్ ఓటమి

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.

Similar News

News July 7, 2025

మొబైల్ రీఛార్జ్‌లు పెంపు?

image

రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది భారీగా ధరలు పెంచగా, ఈ సారీ 10-12% పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూజర్లు పెరగడం, 5G ఫీచర్ల కల్పన నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని సమాచారం. అయితే బేస్ ప్లాన్ల జోలికి వెళ్లకుండా, మిడిల్, టాప్ ప్లాన్ల రేట్లు పెంచుతారని, కొన్ని ప్లాన్లలో కోత విధిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

News July 7, 2025

జులై 7ను జీవితంలో మరిచిపోలేను: రేవంత్ రెడ్డి

image

తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘నియంతృత్వాన్ని సవాల్ చేసి.. నిర్భందాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం. సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జులై 7ను జీవితంలో మరచిపోలేను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.

News July 7, 2025

విద్యార్థులతో మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

image

AP: మంత్రి నారా లోకేశ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు అధికారుల చొరవతో తాజాగా స్కూళ్లో చేరగా వారికి భవిష్యత్తులో తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. పేదరికం నుంచి బయటపడేలా చేసే శక్తిమంతమైన సాధనం విద్య అని లోకేశ్ చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లే కారణమని, ఆమె వల్లే క్రమశిక్షణ అలవడిందని మంత్రి ఎమోషనల్ అయ్యారు.