News October 28, 2024

సుఖ నిద్ర కావాలా? ఇలా చేయండి

image

ప్రస్తుతం పని ఒత్తిడితో కొందరు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. కానీ కొన్ని పనులు చేస్తే గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే శారీరక శ్రమ ఏర్పడి బాగా నిద్ర పడుతుంది. సాయంత్రం గోరు వెచ్చటి నీటితో స్నానం చేసి, గ్లాసు పాలు తాగాలి. అలాగే రాత్రి త్వరగా భోజనం చేయాలి. ఇలా చేస్తే తిన్నవి త్వరగా జీర్ణమై నిద్ర పడుతుంది. రాత్రి కాఫీ, టీ, వైన్, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు.

Similar News

News March 25, 2026

పశ్చిమాసియా యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

image

US-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. ‘యుద్ధం లక్ష్యం ఇప్పుడు “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. నిజానికి యుద్ధం మొదలవ్వకముందు అది తెరిచే ఉంది’ అని లాఫింగ్ ఎమోజీతో ఆయన ట్వీట్ చేశారు. కాగా తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

News March 25, 2026

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ శుభవార్త

image

ప్రపంచ ఇంధన రవాణాకు ఆయువుపట్టు అయిన హార్ముజ్‌ జలసంధిపై ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని UN సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు తెలిపింది. నౌకల భద్రతపై తమ దేశ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జలసంధిని దాటవచ్చని పేర్కొంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు వాటికి సపోర్ట్ చేసే దేశాలకు పర్మిషన్ లేదని స్పష్టం చేసింది.

News March 25, 2026

ఇరాన్‌కు అమెరికా పెట్టిన షరతులు ఇవే!

image

శాంతి ప్రణాళికల్లో భాగంగా ఇరాన్‌కు ట్రంప్ 15 అంశాలను ప్రతిపాదించినట్లు US మీడియా చెబుతోంది. అణ్వాయుధ ప్రయత్నాలను మానుకోవడం, హార్ముజ్ తెరిచి ఉండటం, యురేనియం తవ్వకాలను ఆపడం, న్యూక్లియర్ మెటీరియల్‌ను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి బదిలీ చేయడం, మిలిటెంట్లకు మద్దతు ఆపడం ఇందులో మెయిన్ డిమాండ్స్. ఇందుకు ప్రతిగా ఆంక్షలు పూర్తిగా తొలగించి, అణువిద్యుత్‌కు మద్దతు ఇస్తామని US ప్రతిపాదించినట్లు సమాచారం.