News October 28, 2024

హిమాచల్‌ జట్టుపై రాణించిన విశాఖ బౌలర్

image

విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర vs హిమాచల్ రంజీ మ్యాచ్‌లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసేసరికి హిమాచల్ ప్రదేశ్ 198 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ 65 ఓవర్లలో 198 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర జట్టు బౌలర్ శశికాంత్ అద్భుతమైన బౌలింగ్ చేశారు.

Similar News

News March 3, 2026

విశాఖలో మందగించిన రిజిస్ట్రేషన్లు

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలు పెరుగుతాయని ప్రచారం జరిగినా ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో క్షీణత కనిపించింది. 9 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఫిబ్రవరిలో సుమారు రూ.98 కోట్ల ఆదాయం లభించింది. అర్బన్‌లో అపార్ట్మెంట్లు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 2025-26కి రూ.1400 కోట్ల లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి రూ.952 కోట్లు వసూలయ్యాయి.

News March 3, 2026

రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే పంచకర్ల

image

పెందుర్తి నియోజకవర్గంలోని 10 వార్డుల్లో ఎనిమిది నెలల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. మంగళవారం 77వ వార్డులో మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి రూ.7.5 కోట్ల విలువైన సిసి రోడ్లు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.

News March 3, 2026

విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

image

ఆర్కే‌బీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.