News October 28, 2024
పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహణ

అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఆదివారం నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీసులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. “పర్యావరణ పరిరక్షణ పోలీసుల సవాళ్లు” అనే అంశంపై పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు బహుమతులు అందజేస్తామన్నారు.
Similar News
News July 7, 2025
నెల్లూరు: ప్రార్థనల అనంతరం మీ దారెటు.?

నెల్లూరులో బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ప్రారంభమైన విషయం తెలిసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు నెల్లూరుకు చేరుకున్నారు. ప్రతి ఏడాది ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులు జిల్లాలోని పలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తారు. వాటిలో ముఖ్యమైనవి:
☞ ఏఎస్ పేట దర్గా ☞ కసుమూరు దర్గా ☞ సోమశిల ప్రాజెక్టు
☞ మైపాడు బీచ్ ☞ పెంచలకోన ☞ కండలేరు రిజర్వాయర్ ☞ ఉదయగిరి కోట
మీరు ఎక్కడికి వెళ్తున్నారు.?
News July 7, 2025
నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News July 7, 2025
నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.