News October 28, 2024

మహారాష్ట్రలో ఒంటరిగా గెలవలేం.. కానీ: ఫడ్నవీస్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఒంటరిగా గెలవలేదని ఆ పార్టీ నేత, Dy.cm దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అయితే అధిక సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందన్నారు. మిత్రపక్షాలైన షిండే శివసేన, అజిత్ పవార్ NCPలతో కలిసి పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సీట్లు ఆశించిన కొందరికి అవకాశం దక్కకపోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు.

Similar News

News October 28, 2024

సూట్‌కేసులో ప్రియుడిని కుక్కిన ప్రేయసి.. ప్రియుడి మృతి!

image

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సారా బూన్ తన ప్రియుడితో కలిసి మద్యం సేవించింది. ఆ తర్వాత సరదాకి అతడిని సూట్‌కేస్‌లోకి వెళ్లమని బయటి జిప్ వేసింది. ఆ తర్వాత మద్యం మత్తులో నిద్రపోయింది. ఉదయం లేచేసరికి సదరు ప్రియుడు లోపల ఊపిరాడక చనిపోయాడు. పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. సారా వాదనను కోర్టు అంగీకరించలేదు. ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు తేల్చింది. త్వరలోనే శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.

News October 28, 2024

31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: TTD

image

AP: తిరుమలలో దీపావళి ఆస్థానం దృష్ట్యా ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్టు TTD వెల్లడించింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ నెల 30న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

News October 28, 2024

చైనాలో మూతపడుతున్న కిండర్‌గార్టెన్‌ స్కూళ్లు!

image

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా నేడు జనాభా తగ్గుదలతో ఇక్కట్లు పడుతోంది. అక్కడ జననాల సంఖ్య భారీగా తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరుగుదల పెరిగింది. ఈ క్రమంలో పిల్లలు లేక LKG, UKG పాఠశాలలు వేల సంఖ్యలో మూత పడుతున్నాయి. ఒకప్పుడు పిల్లలు వద్దంటూ నియంత్రించిన సర్కారే నేడు కనమని వేడుకుంటున్నా.. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక చైనీయులు పిల్లల్ని కనడం లేదు.