News October 28, 2024
‘కూటమి’ డైవర్షన్ పాలిటిక్స్‌ను తిప్పికొడదాం: వైసీపీ
AP: కూటమి ప్రభుత్వం 5 నెలలుగా ఒక్క కొత్త పథకమూ అమలు చేయలేదని వైసీపీ విమర్శించింది. ‘ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ‘జూన్‌లో రుషికొండ భవనాలు, జులైలో శ్వేతపత్రాలు, AUGలో ముంబై నటి, SEPలో ప్రకాశం బ్యారేజీలో బోట్లు, శ్రీవారి లడ్డు, OCTలో YSR కుటుంబంపై విషప్రచారాలు చేసింది. వీటిని తిప్పికొడుతూ ప్రభుత్వ నయవంచనలను నిలదీయాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
Similar News
News November 1, 2024
భారీగా డ్రగ్స్ పట్టివేత
TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.
News November 1, 2024
సూర్య-జ్యోతికల పిల్లలను చూశారా?
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూసేవారున్నారు. అయితే, తన భార్య నటి జ్యోతికతో తప్ప పిల్లలతో ఆయన మీడియా ముందు కనిపించరు. తాజాగా కుటుంబమంతా కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ ఫొటో వైరలవుతోంది. దీంతో ఈ దంపతుల పిల్లలు ఇంత ఎదిగిపోయారా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 1, 2024
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్
TG: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. నిన్న Xలో ప్రజలతో కేటీఆర్ సంభాషణలను BRS ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని, ప్రజల పక్షాన కొట్లాడడమే తమ ప్రస్తుత బాధ్యత అని చెప్పారు. BRS నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.