News October 28, 2024

సుమతీ నీతి పద్యం.. తాత్పర్యం

image

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!
తాత్పర్యం: భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరతాయి. అలాగే మూర్ఖుడు, పిసినారి దాచిన సంపద రాజులపాలవుతుంది. అతనికి ఏమాత్రం ఉపయోగపడదు.

Similar News

News October 28, 2024

ALERT.. రేపటి నుంచి వర్షాలు

image

తెలంగాణలో రేపటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News October 28, 2024

70 ఏళ్లు పైబడిన వారికి రేపు ఆయుష్మాన్ భారత్ ప్రారంభం

image

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన(AB-PMJAY)ను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధిపొందుతారు. 29వేలకు పైగా ఆస్పత్రుల్లో సేవలు లభిస్తాయి. అర్హులైనవారు PMJAY పోర్టల్ లేదా ఆయుష్మాన్ భారత్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News October 28, 2024

10 మంది స్పెషల్ పోలీసుల డిస్మిస్

image

TG: పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని <<14463743>>సస్పెండ్<<>> చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.