News October 28, 2024

31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: TTD

image

AP: తిరుమలలో దీపావళి ఆస్థానం దృష్ట్యా ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్టు TTD వెల్లడించింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ నెల 30న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Similar News

News October 28, 2024

రుడా ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు

image

TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.

News October 28, 2024

టాలీవుడ్ నిర్మాత కన్నుమూత

image

సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి(85) బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో కన్నుమూశారు. తొలుత సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. వియ్యాలవారి కయ్యాలు, ప్రతిబింబాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర్‌రావుతో 1982లో ఆయన తీసిన ‘ప్రతిబింబాలు’ 2022లో విడుదలైంది.

News October 28, 2024

టెస్లా CFOతో మంత్రి లోకేశ్ భేటీ.. పెట్టుబడులపై చర్చ

image

ఏపీలో పెట్టుబడులపై టెస్లా CFO వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. USలోని ఆస్టిన్‌లో ఉన్న టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 72GW రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే తమ లక్ష్యమని, దీనికి టెస్లా వంటి గ్లోబల్ కంపెనీ సహాయ, సహకారాలు అవసరమని పేర్కొన్నారు.