News October 28, 2024

10 మంది స్పెషల్ పోలీసుల డిస్మిస్

image

TG: పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని <<14463743>>సస్పెండ్<<>> చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Similar News

News October 28, 2024

హైదరాబాద్‌లో నెల రోజులపాటు ఆంక్షలు

image

TG: హైదరాబాద్‌లో నవంబర్ 28 వరకు నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పలు సంస్థలు, పార్టీలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు.

News October 28, 2024

ఏపీలో సీప్లేన్ సర్వీసులు.. డిసెంబర్ 9న ప్రారంభం

image

ఏపీలో సీప్లేన్ సర్వీసులను డిసెంబర్ 9న ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తొలుత ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాలను ఒకే రోజు అతి తక్కువ ఖర్చుతో దర్శించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

News October 28, 2024

HYDRA అప్రూవ్డ్ ఇళ్లు లభించును.. బిల్డర్ల ప్రకటనలు

image

TG: HYDలో హైడ్రా అధికారులు ఏ భవనాన్ని ఎప్పుడు కూలుస్తారోననే భయంతో కొత్త ఇళ్లు కొనేందుకు జనం జంకుతున్నారు. దీంతో ‘మా వద్ద హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు ఉన్నాయి. మా ప్రాజెక్టులో ఇళ్లు కొనండి’ అని బిల్డర్లు ప్రకటనలు చేస్తున్నారు. అటు FTL, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భవనాలను కూల్చివేస్తుండటం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డౌన్‌పేమెంట్ కట్టిన వారూ డెవలపర్లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు.