News October 28, 2024

ALERT.. రేపటి నుంచి వర్షాలు

image

తెలంగాణలో రేపటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. కొన్ని రోజులుగా మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Similar News

News October 28, 2024

సుప్రీమ్ లీడర్ అకౌంట్ సస్పెండ్ చేసిన X

image

ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హీబ్రూ అకౌంట్‌ను X సస్పెండ్ చేసినట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ‘జియోనిస్టు ప్రభుత్వం తప్పు చేసింది. తమ సమీకరణాల్లో ఇరాన్‌ను తక్కువగా లెక్కగట్టింది. మాకెలాంటి శక్తి, సామర్థ్యం, ఆకాంక్షలు ఉన్నాయో అర్థమయ్యేలా చేస్తాం’ అని ఆదివారం ఖమేనీ పోస్ట్ చేశారు. ‘దయామయుడైన అల్లా పేరుతో…’ అని శనివారం పెట్టారు. ఇవి ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత చేసినవే కావడం గమనార్హం.

News October 28, 2024

నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించిన సాయిపల్లవి

image

ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించిన ఫొటోలను హీరోయిన్ సాయిపల్లవి పంచుకున్నారు. ‘అమరన్ సినిమా ప్రమోషన్లను ప్రారంభించే ముందు అక్కడికి వెళ్లాలనుకున్నా. మనకోసం ప్రాణాలు అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం ఇక్కడ వేలాది ఇటుకలను ఉంచారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ AC(P)& సిపాయి విక్రమ్ సింగ్‌లకు నివాళి అర్పిస్తూ నేను భావోద్వేగానికి లోనయ్యా’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ‘అమరన్’ ఈనెల 31న రిలీజ్ కానుంది.

News October 28, 2024

రైతులను దివాలా తీయిస్తారా?: KTR

image

TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.