News October 28, 2024
అన్న క్యాంటీన్‌లకు విరాళమిస్తే ఐటీ మినహాయింపు

AP: అన్న క్యాంటీన్ పేరుతో ప్రభుత్వం ఛారిటబుల్ ట్రస్టును వచ్చే నెలలో ఏర్పాటుచేయనుంది. ఇందుకు IT శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాలు అనుమతి ఇచ్చాయి. విరాళాలు ఇచ్చే వారికి IT మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ కంపెనీలు, సామాన్యుల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. 100 క్యాంటీన్లలో మూడు పూటలకు కలిపి రూ.26.25 లక్షలు ఇచ్చేవారికి రోజంతా వారిపేరుతోనే ఆహారం అందిస్తారు.
Similar News
News January 29, 2026
WGL: 2,500 మంది చిన్నారులకు ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్స్

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చి తప్పిపోయే చిన్నారుల ఆచూకీ కనుకొనేందుకు పోలీసులు రూపొందించిన చైల్డ్ ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్‌పై భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 1500 ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్‌లను చిన్నారులకు అమర్చారు. ఇందులో హన్మకొండ బస్టాండ్‌లో 1500 రిస్ట్ బ్యాండ్‌లు అమర్చగా, వరంగల్ బస్టాండ్‌లో పరిధిలో 1000 రిస్ట్ బ్యాండ్లను అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
News January 29, 2026
ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
News January 29, 2026
లవ్లీ హోం హ్యాక్స్

* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు జిడ్డుగా ఉంటే పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్ సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి శుభ్రం చేస్తే సరిపోతుంది.
* ఉప్పు, నిమ్మరసం కలిపి పింగాణీ పాత్రలను తోమితే మెరుస్తాయి.


