News October 28, 2024
మంత్రి ఆనం ఆధ్వర్యంలో జాబ్ మేళా

అనంతసాగరం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజాసమస్యల పరిష్కార వేదికతో పాటు సోమవారం జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సుధీర్ తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాకు ఐటీఐ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, రిటైల్, మేనేజ్మెంట్ ఎఫ్ఎంసీజీ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. టెన్త్,ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన చేసిన వారు అర్హులు.
Similar News
News November 12, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా 19,678 గృహ ప్రవేశాలు

జిల్లాలో PMAY కింద పూర్తి చేసిన 19,678 గృహాల ప్రవేశం బుధవారం జరగనుంది. అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేశారు.అదే విధంగా PMAY కింద 2.0 పథకం కింద మరో 2,838 మందికి గృహాలను మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఆవాస్ ప్లస్-2024 సర్వేలో భాగంగా గ్రామీణ యాప్ ద్వారా లబ్ధిదారుల నమోదు జరుగనుంది.
News November 11, 2025
18న రాష్ట్రపతి నుంచి అవార్డ్ అందుకోనున్న కలెక్టర్

నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో ‘జల్ సంచయ్ జన్ భగీధారి 1.0’ నేషనల్ అవార్డు లభించింది. నవంబర్ 18న న్యూఢిల్లీలో ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుకోనున్నారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ గంగాభవాని కలెక్టర్కు అభినందనలు తెలిపారు,
News November 11, 2025
నెల్లూరు కలెక్టరేట్లో మౌలానాకు నివాళి

నెల్లూరు కలెక్టరేట్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరిగింది. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా నివాళి అర్పించారు. దేశంలో విద్యావ్యవస్థకు సంస్కరణలతో అబుల్ కలామ్ బాటలు వేశారని తెలిపారు.


