News October 28, 2024

18 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన స్పెయిన్ ప్రెసిడెంట్

image

స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో సాంచెజ్ ఎర్లీమార్నింగ్ వడోదరాకు చేరుకున్నారు. 3 రోజుల పర్యటనకు వచ్చిన ఆయనకు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ స్వాగతం పలికారు. మేకిన్ ఇండియాలో భాగంగా C295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌ను PM మోదీతో కలిసి ప్రారంభిస్తారు. అలాగే కొన్ని MOUలు, అగ్రిమెంట్లపై సంతకం చేస్తారు. ట్రేడ్ వర్గాలను కలుస్తారు. స్పెయిన్ ప్రెసిడెంట్ భారత్‌కు రావడం 18 ఏళ్లలో ఇదే తొలిసారి.

Similar News

News November 1, 2024

నువ్వా?నేనా?.. కమల vs ట్రంప్

image

అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసే బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఈసారి డెమొక్రటిక్ పార్టీకి అండగా ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై కఠినంగా వ్యవహరిస్తానని ట్రంప్ చెప్పడంతో ప్రవాస ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసే ఛాన్స్ ఉంది. నిరుద్యోగం, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్-ఇరాన్ యుద్ధాలు కమల పార్టీకి దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. తాను వస్తేనే US ఆర్థికవ్యవస్థ గాడిన పడుతుందని ట్రంప్ చెబుతున్నారు.

News November 1, 2024

Flipkartలో సరికొత్త మోసం?

image

Flipkartలో జరుగుతోన్న ఓ మోసాన్ని కేశవ్ అనే వ్యక్తి లేవనెత్తారు. Mokobora కంపెనీకి చెందిన సూట్‌కేస్ ధరను ఆండ్రాయిడ్, iOSలలోని Flipkart యాప్‌లో కంపేర్ చేశారు. ఆండ్రాయిడ్‌లో దీని ధర రూ.4819 ఉండగా, iOSలో రూ.5499 ఉంది. ఒకే కంపెనీ బ్యాగుకూ ఎందుకీ వ్యత్యాసమని ఆయన మండిపడ్డారు. దీనిపై Flipkart స్పందిస్తూ.. ‘వివిధ అంశాల ఆధారంగా ధరలను విక్రేత నిర్ణయించడంతో కొన్నిసార్లు వ్యత్యాసం ఉంటుంది’ అని పేర్కొంది.

News November 1, 2024

నాకంటే వారికే ఎక్కువ దక్కాలి: రోహిత్ శర్మ

image

ముంబై ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోగా రోహిత్ శర్మ కంటే బుమ్రా, సూర్య, పాండ్యకే ఎక్కువ మొత్తం ఇస్తోంది. దీనిపై రోహిత్ స్పందించారు. ‘నేను T20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాను. జాతీయ జట్టుకు ఆడేవారికి ఎక్కువ ప్రాధాన్యం దక్కాలని భావించా. నాకు ఇదే సరైన ప్లేస్’ అని చెప్పారు. కాగా, బుమ్రాకు రూ.18 కోట్లు, సూర్య, పాండ్యకు రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మకు రూ.16.30 కోట్లు, తిలక్ వర్మకు రూ.8 కోట్లు దక్కాయి.