News October 28, 2024

HYDRA అప్రూవ్డ్ ఇళ్లు లభించును.. బిల్డర్ల ప్రకటనలు

image

TG: HYDలో హైడ్రా అధికారులు ఏ భవనాన్ని ఎప్పుడు కూలుస్తారోననే భయంతో కొత్త ఇళ్లు కొనేందుకు జనం జంకుతున్నారు. దీంతో ‘మా వద్ద హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు ఉన్నాయి. మా ప్రాజెక్టులో ఇళ్లు కొనండి’ అని బిల్డర్లు ప్రకటనలు చేస్తున్నారు. అటు FTL, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భవనాలను కూల్చివేస్తుండటం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డౌన్‌పేమెంట్ కట్టిన వారూ డెవలపర్లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు.

Similar News

News October 28, 2024

రెండు రోజుల సమయం కావాలి: రాజ్ పాకాల

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని పోలీసులకు KTR బావమరిది రాజ్ పాకాల లేఖ రాశారు. రెండు రోజుల గడువు కోరుతూ మోకిల పోలీసులకు న్యాయవాదుల ద్వారా లేఖ పంపారు. ఇవాళ విచారణకు రావాలని ఆయనకు పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

News October 28, 2024

జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కన్నుమూత

image

ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రభుత్వంపై పోరాడిన జస్టిస్ కేఎస్ పుట్టస్వామి(98) కన్నుమూశారు. ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2012లో ఆయన ఆధార్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత ఆధార్‌కూ కొన్ని పరిమితులున్నాయంటూ కోర్టు తీర్పునిచ్చింది.

News October 28, 2024

శాప్ నెట్‌ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: సొసైటీ ఫర్ ఏపీ నెట్‌వర్క్(శాప్ నెట్)ను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ నెట్ సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాప్ నెట్, మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఇప్పుడు ఆ సేవలను విద్యామండలి నుంచే సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.