News October 28, 2024
STOCK MARKETS: 5 సెషన్ల వరుస నష్టాల తర్వాత..
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 5 సెషన్ల వరుస నష్టాల తర్వాత కాస్త పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. సెన్సెక్స్ 79,869 (+466), నిఫ్టీ 24,271 (+90) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ షేర్లు కళకళలాడుతున్నాయి. కోల్ ఇండియా, ONGC, BEL, LT, SBI లైఫ్ టాప్ లూజర్స్. ICICI, SBI టాప్ గెయినర్స్.
Similar News
News November 1, 2024
20 సిలిండర్ల డబ్బు లాగేస్తున్నారు.. YCP వెర్షన్
AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం రూ.2,685 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. అయితే ఇదంతా ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటున్నట్లు ఉందని YCP ఆరోపిస్తోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నేటి నుంచి ప్రజలపై రూ.17,072 కోట్లు భారం మోపుతున్నారంటోంది. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామంటూ 20 సిలిండర్ల డబ్బుల్ని సర్కార్ వసూలు చేస్తోందని YCP చురకలంటిస్తోంది. నిబంధనలతో అందరికీ స్కీమ్ అందడం లేదంది.
News November 1, 2024
ఫ్రీ గ్యాస్.. నేడే ప్రారంభం
AP: ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తారు. కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్‌ను తీసుకుంటే 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం జమ చేస్తుంది.
News November 1, 2024
పెరిగిన సిలిండర్ ధర
దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.61 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం HYDలో కమర్షియల్ LPG ధర రూ.2,028కి చేరింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.