News October 28, 2024

తూ.గో: రూ.250 కోట్లతో రైల్వే స్టేషన్ల నవీకరణ

image

తూ.గో.జిల్లాలోని రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఇందులో రాష్ట్రంలోని 53 స్టేషన్లు ఎంపిక కాగా జిల్లాలోని పలు స్టేషన్లకూ చోటు దక్కింది. రాజమండ్రి స్టేషన్‌కు రూ.214 కోట్లు, కాకినాడ జంక్షన్‌కు రూ.21 కోట్లు, సామర్లకోట స్టేషన్‌కు రూ.15.13 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. పనులన్నీ పూర్తి అయ్యాక రాజమండ్రి రైల్వేస్టేషన్ పైఫొటోలో ఉన్నట్లు కనిపిస్తుంది.

Similar News

News October 31, 2024

తూ.గో: గుజరాత్‌లో మృతి చెందిన వారు వీరే..

image

తూ.గో. జిల్లా యువకులు ఇద్దరు గుజరాత్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. కొవ్వూరు(M)కి చెందిన రవితేజ, లోహిత్ గుజరాత్‌లో మంగళవారం స్నేహితులతో కలిసి విహరయాత్రకు వెళ్లి జలాశయంలో మునిగిపోయారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్థానిక MLA వెంకటేశ్వరరావు ఎంపీ పురందీశ్వరికి ఈ విషయం చెప్పగా.. అక్కడి అధికారులతో ఆమె మాట్లాడారు. వారి మృతదేహాలను కొవ్వూరుకు రప్పించాలన్నారు.

News October 31, 2024

గుజరాత్‌లో ఇద్దరు తూ.గో. జిల్లా వాసులు మృతి

image

ఇద్దరు తూ.గో. జిల్లా యువకులు గుజరాత్‌లో చనిపోయారు. కొవ్వూరు(M) చెందిన టీడీపీ నేత హరిబాబు కుమారుడు రవితేజ, మరొక యువకుడు లోహిత్ గుజరాత్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వారు అక్కడ పలు ప్రాంతాలను చూసేందుకు వెళ్లి ఓ జలాశయంలో మునిగి చనిపోయారు. కుమారుల మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి మృతదేహాలు కొవ్వూరుకు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు MLA వెంకటేశ్వరరావు తెలిపారు.

News October 31, 2024

పిఠాపురం: ‘ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం’

image

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవాళి దీపావళి అని అభివర్ణించారు. దీపాల శోభతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలకు సకల శుభాలను ఆనందాన్ని కలుగజేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రం దీపాల వలె వెలగాలని కోరారు.