News October 28, 2024

జనగణనకు సిద్ధమైన కేంద్రం?

image

2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.

Similar News

News October 28, 2024

40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తాడు!

image

కాంచీపురం(TN)లోని అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ ఆలయంలో స్వామి విగ్రహాలు రెండు ఉండగా అందులో ఒకటి మాత్రమే నిత్యం పూజలందుకుంటుంది. కర్రతో చేసిన 9 అడుగుల చెక్క విగ్రహం 40 ఏళ్లకు ఒకసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అప్పటివరకు ఆ విగ్రహాన్ని ఆలయ పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరుస్తారు. చివరగా 2019లో విగ్రహాన్ని బయటకు తీశారు.

News October 28, 2024

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక.. తెలుగు ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

image

ఆస్ట్రేలియాపై ఆడాలన్నది తన చిన్నప్పటి కల అని తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశం తరఫున టెస్టులు ఆడే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తాననే నమ్మకం ఉందన్నారు. AUSలోని పరిస్థితులపై తనకు అవగాహన ఉందని తెలిపారు. SRHకు కమిన్స్ సారథ్యంలో ఆడానని ఇప్పుడు ప్రత్యర్థిగా ఆడనున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే BGTకి నితీశ్ ఎంపికైన సంగతి తెలిసిందే.

News October 28, 2024

పార్టీలపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం

image

TG: వందల మంది వచ్చి మద్యం తాగాల్సిన పరిస్థితుల్లో ఎక్సైజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒకరిద్దరి విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి మద్యపాన నిషేధం లేదని, దావత్‌లు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.