News October 28, 2024

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

image

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.490, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.450 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,150గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.

Similar News

News February 13, 2026

మున్సిపల్ ఫలితాలు.. ఇప్పటి వరకు..

image

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు 65 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపు జెండా ఎగరేసింది. BRS 14 చోట్ల గెలుపొందగా, BJP ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 34 చోట్ల హంగ్ ఏర్పడింది. వార్డుల్లో కాంగ్రెస్ 1,310, BRS 707, BJP 249చోట్ల గెలుపొందాయి. అటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

News February 13, 2026

ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. ఇది మర్చిపోవద్దు!

image

భారతీయ రైల్వే 45 పైసలకే ₹10 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తోందని తెలుసా? ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ సర్వీసును అందిస్తోంది. ప్రమాదంలో మరణించినా/శాశ్వత వైకల్యం ఏర్పడినా ₹10 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹7.5 లక్షలు, గాయపడితే ₹2 లక్షలు అందిస్తుంది. మృతదేహం తరలింపుకు ₹10 వేలు ఇస్తుంది. బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ కోసం నామినీ వివరాలు ఎంటర్ చేయడం మర్చిపోవద్దు.

News February 13, 2026

తమలపాకులతో ఇలా చేస్తే..

image

‘నాగవల్లి దళాలు’ అని పిలిచే తమలపాకులు అతి పవిత్రమైనవి. ఈ ఆకులో లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతలు ఉంటారని పురాణాల వాక్కు. అందుకే శుభకార్యాల్లో తాంబూలం సమర్పిస్తారు. ఇది సంపూర్ణతకు నిదర్శనం. సీతాదేవి ఆశీస్సుల వల్ల హనుమాన్‌కి ఇవంటే చాలా ప్రీతి. ఆయనను వీటితో పూజిస్తే శని దోషాలు పోతాయని నమ్మకం. అలాగే వీటికి ఔషధ గుణాలెన్నో! జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. పూజలో తాజాగా, తొడిమ ఉన్న ఆకులను వాడటం ఉత్తమం.