News October 28, 2024

అసెంబ్లీలో పీఏసీ సమావేశం.. బహిష్కరించిన BRS

image

TG: అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష BRS పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపింది. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. BRS నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన BRS నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో కారు పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.

Similar News

News February 18, 2026

కొల్లేటి వ్యవసాయం గొడ్డు వినాశనం

image

కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతం పల్లపు ప్రదేశం కావడంతో వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు పూర్తిగా మునిగిపోతాయి. దీని వల్ల రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాదు. అలాగే భూముల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల గడ్డి కుళ్లిపోయి, పశువులకు మేత కూడా లభించదు. ఫలితంగా మేత లేక, రోగాల బారిన పడి పశువులు చనిపోతాయి. అందుకే కొల్లేటి వ్యవసాయం అటు పంటను, ఇటు పశుసంపదను కూడా ముంచేస్తుందని ఈ సామెత భావం.

News February 18, 2026

దేవాలయంలో ఏ దానంతో ఏ పుణ్యం?

image

గుడిలో వస్తురూపేణా చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. శంఖం దానంతో పుణ్యలోక ప్రాప్తి, గంట దానంతో కీర్తి, గజ్జెల దానంతో సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘ధ్వజస్తంభంతో యశస్సు, జెండాలతో పాపవిముక్తి, సుగంధ ద్రవ్యాలతో రూప సంపత్తి, పందిళ్లు నిర్మిస్తే ధర్మబుద్ధి కలుగుతాయి. ఇలా ఆలయ అభివృద్ధికి, సౌకర్యాలకు చేసే సాయం భక్తులకు ఇహపర సుఖాలు కలుగుతాయి’ అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.

News February 18, 2026

రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే..

image

రోజుకు 10 నిమిషాలైనా ఎండలో ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుంది. ఇది ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి సాయపడుతుంది. మూడ్‌ని మార్చేసి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. చర్మంలోని నైట్రిక్ ఆక్సైడ్‌ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది’ అని చెబుతున్నారు.