News October 28, 2024

జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కన్నుమూత

image

ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ప్రభుత్వంపై పోరాడిన జస్టిస్ కేఎస్ పుట్టస్వామి(98) కన్నుమూశారు. ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2012లో ఆయన ఆధార్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత ఆధార్‌కూ కొన్ని పరిమితులున్నాయంటూ కోర్టు తీర్పునిచ్చింది.

Similar News

News October 28, 2024

మరో ఐదుగురు జర్నలిస్టులు మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పలు సంస్థలకు చెందిన మ‌రో ఐదుగురు జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు త‌మ‌ను భ‌య‌పెట్ట‌లేవ‌ని, ఇజ్రాయెల్ నిరంకుశ‌త్వాన్ని వెలికితీయ‌కుండా జ‌ర్న‌లిస్టుల‌ను నిలువ‌రించ‌లేవ‌ని గాజాలోని ప్ర‌భుత్వ‌ మీడియా ఆఫీస్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల‌పై అంత‌ర్జాతీయ స‌మాజం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఇప్ప‌టిదాకా 176 మంది జ‌ర్న‌లిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

News October 28, 2024

యంగ్ ప్లేయర్లకు IPLపైనే ఎక్కువ ఇంట్రస్ట్: MSK

image

భారత క్రికెట్ భవిష్యత్తుపై BCCI మాజీ సెలక్టర్ MSK ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లలో చాలా మంది దేశానికి ఆడేకంటే IPL ఆడేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘IPLతో ప్లేయర్ల మైండ్‌సెట్ మారింది. అన్ని ఫార్మాట్లలో దూకుడుగా ఆడేస్తున్నారు. స్పిన్, స్వింగ్‌ను ఆడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు సచిన్, గంగూలీ వంటి వారు ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడేవారు’ అని పేర్కొన్నారు.

News October 28, 2024

సూపర్ న్యూస్.. కృష్ణుడి పాత్రలో మహేశ్ బాబు?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాజమౌళితో మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాకపోగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన చిత్రంలో క్లైమాక్స్‌లో కృష్ణుడిగా కనిపిస్తారని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం గమనార్హం. కాగా మహేశ్ పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.