News October 28, 2024

ఓబీసీలను మోదీ వంచించారు: కాంగ్రెస్

image

కుల‌గ‌ణ‌న‌కు అంగీక‌రించ‌కుండా OBCల‌ను ప్ర‌ధాని మోదీ వంచించార‌ని కాంగ్రెస్ విమ‌ర్శించింది. వ‌చ్చే ఏడాది జ‌న‌గ‌ణ‌న‌కు సిద్ధ‌మైన కేంద్రం కుల‌గ‌ణ‌నను విస్మ‌రించ‌డాన్ని ప్ర‌ధాన విప‌క్షం త‌ప్పుబ‌ట్టింది. ఈ విష‌యంలో NDA ప్ర‌భుత్వాన్ని ఆపుతున్న‌దేంట‌ని ప్ర‌శ్నించింది. మోదీ త‌న రాజ‌కీయ అహంకారంతో కుల‌గ‌ణ‌నను ప‌క్క‌న‌పెట్టార‌ంది. దీనిపై NDA మిత్ర‌ప‌క్షాలైన JDU, TDPల వైఖ‌రేంటో చెప్పాల‌ని డిమాండ్ చేసింది.

Similar News

News January 14, 2026

రేపు భోగి.. ఏం చేస్తారంటే?

image

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజును భోగిగా పిలుస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పనికి రాని, పాత చెక్కవస్తువులతో భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు ఇంటిని శుద్ధి చేసి పిండి వంటలు చేసుకొని తింటారు. దానం చేస్తారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. కొందరు తమ ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.

News January 14, 2026

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై విజయం

image

WPL-2026లో గుజరాత్‌తో జరిగిన మ్యాచులో ముంబై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్(71*) అర్ధసెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. <<18849934>>193<<>> పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కమలిని(13), మాథ్యూస్(22) విఫలమయ్యారు. ఆ తర్వాత అమన్‌జోత్(40)తో కలిసి హర్మన్ 72 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తర్వాత వచ్చిన కేరీ(38*) మెరుపులు తోడవ్వడంతో ముంబై ఈ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.

News January 14, 2026

అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

image

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.