News October 28, 2024

40 ఏళ్లకు ఒకసారి దర్శనమిస్తాడు!

image

కాంచీపురం(TN)లోని అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయం గురించి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ ఆలయంలో స్వామి విగ్రహాలు రెండు ఉండగా అందులో ఒకటి మాత్రమే నిత్యం పూజలందుకుంటుంది. కర్రతో చేసిన 9 అడుగుల చెక్క విగ్రహం 40 ఏళ్లకు ఒకసారి 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అప్పటివరకు ఆ విగ్రహాన్ని ఆలయ పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరుస్తారు. చివరగా 2019లో విగ్రహాన్ని బయటకు తీశారు.

Similar News

News October 28, 2024

డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు CCTV ఫుటేజీనీ ఎత్తుకెళ్లారు!

image

ఓ బ్యాంకును లూటీ చేసిన దొంగ‌ల ముఠా డ‌బ్బు, న‌గ‌ల‌తోపాటు అక్క‌డి CCTV ఫుటేజ్‌ని కూడా ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. న్యామ‌తి టౌన్‌లోని SBI ACB నెహ్రూ రోడ్ బ్రాంచ్‌లో కిటికీలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి చోరీకి పాల్ప‌డిన ముఠా లాక‌ర్ల‌లోని డ‌బ్బు, బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే పోలీసుల‌కు త‌మ ఆన‌వాళ్లు ల‌భించ‌కూడ‌ద‌ని CCTV ఫుటేజ్‌ని సైతం ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 28, 2024

ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఫంక్షన్‌లో తారల సందడి

image

ANR జాతీయ అవార్డు ఫంక్షన్‌లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అఖిల్ హాజరయ్యారు. సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌తో పాటు సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం హాజరయ్యారు.

News October 28, 2024

ఉచిత సిలిండర్ పథకం.. కీలక అప్డేట్

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల జాయింట్ అకౌంట్‌కు రూ.895 కోట్లు రిలీజ్ చేసింది. పట్టణ ప్రజలకు 24 గంటల్లో, గ్రామీణ ప్రజలకు 48 గంటల్లో DBT ద్వారా డబ్బులు జమచేయనుంది. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వనుంది. కాగా ఈ నెల 31 నుంచి ఈ పథకం అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.