News October 28, 2024

BJPకి విజయ్ C-Team అంటూ DMK ఫైర్

image

ద‌ళ‌ప‌తి విజ‌య్ స్థాపించిన త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గంపై అధికార DMK అప్పుడే విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. BJPకి TVK సీ-టీం అంటూ విమ‌ర్శించింది. డీఎంకే విధానాల‌ను కాపీకొట్టి ద్ర‌విడీయ‌న్ మోడ‌ల్ ప్ర‌భుత్వాన్ని త‌మిళ‌నాడు నుంచి ఎవ‌రు వేరు చేయ‌లేర‌ని విజ‌య్ నిరూపించార‌ని మంత్రి రేగుప‌తి పేర్కొన్నారు. అన్నాడీఎంకే క్యాడ‌ర్‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికే ఆ పార్టీని విజ‌య్ ప‌ల్లెత్తుమాట అన‌లేద‌ని విమ‌ర్శించారు.

Similar News

News November 1, 2024

అరుదైన రికార్డు ముంగిట అశ్విన్

image

NZతో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో ఓ అరుదైన రికార్డుపై అశ్విన్ కన్నేశారు. ఈ మ్యాచ్‌ ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్లు కూల్చిన ప్లేయర్‌, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా నిలుస్తారు. ప్రస్తుతం కుంబ్లే, అశ్విన్ చెరో 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో మురళీధరన్(77), రిచర్డ్(41), షేన్ వార్న్(38) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.

News November 1, 2024

నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం
✒ 1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
✒ 1959: APలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదలు
✒ 1966: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఏర్పాటు
✒ 1973: మైసూరు రాష్ట్రం పేరు కర్ణాటకగా మార్పు
✒ 1974: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జననం
✒ 1986: హీరోయిన్ ఇలియానా జననం
✒ 1989: అలనాటి హీరో హరనాథ్ మరణం

News November 1, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.