News October 28, 2024

సల్మాన్‌కు దూరంగా ఉండు.. లేదంటే లేపేస్తాం: బిష్ణోయ్ గ్యాంగ్

image

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బిహార్ MP పప్పూ యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చింది. ‘నిన్ను ట్రాక్ చేస్తున్నాం. సల్మాన్‌ ఖాన్‌తో దూరంగా ఉండు. లేదంటే చంపేస్తాం’ అని ఓ ఆడియో క్లిప్ పంపించారు. ‘జైల్లో ఉన్న లారెన్స్ గంటకు రూ.లక్ష చెల్లించి సిగ్నల్ జామర్స్‌ను నిలిపివేసి, మీతో మాట్లాడటానికి చూస్తున్నారు. కానీ మీరు తిరస్కరిస్తున్నారు. త్వరగా సెటిల్ చేసుకోండి’ అని అందులో సూచించారు. దీంతో పప్పూ పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News February 12, 2026

సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల డ్యూటీనా: YCP ప్రశ్న

image

AP: NTR జిల్లా జగ్గయ్యపేటలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా సచివాలయ ఉద్యోగులను టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని డ్యూటీలు వేయడం ఏంటని YCP ప్రశ్నించింది. ‘సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరి చేసే బానిసలు అనుకుంటున్నారా? అక్కడ ఏటా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరమే కొత్తగా జరగడం లేదు. ఆదివారం, సెలవు రోజుల్లో ఉద్యోగులకు పని చెప్పడం దారుణం’ అని ట్వీట్ చేసింది.

News February 12, 2026

హెన్నాతో ఎన్నో లాభాలు

image

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.

News February 12, 2026

ఈ దశలో మామిడి పూతపై మందుల పిచికారీ వద్దు

image

మామిడి చెట్లలో పూత పూర్తిగా విడిగిన దశలో ఎలాంటి పురుగు మందులను చెట్లపై పిచికారీ చేయవద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ దశలో పురుగు మందుల పిచికారీ వల్ల మామిడి పిందెలు కట్టడానికి సాయపడే కీటకాలు, తేనెటీగలు చనిపోతాయి. పూలలోని పుప్పొడి, మందు ద్రావణంలో కొట్టుకుపోతుంది. దీని వల్ల పూలలో సంపర్కం జరగక పిందెలేర్పడవు. అందుకే ఈ సమయంలో నిపుణుల సలహాలను రైతులు తప్పక తీసుకోవాలి.