News October 28, 2024

ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ అంతం చేయగలరు: జెలెన్‌స్కీ

image

రష్యా తమపై చేస్తున్న యుద్ధాన్ని ఆపడంలో PM మోదీ కీలక పాత్ర పోషించగలరని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ‘అనేక అంశాల్లో భారత్‌ది ప్రపంచంలో తిరుగులేని స్థానం. అలాంటి దేశానికి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆయన కేవలం యుద్ధం వద్దని చెప్తే సరిపోదు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ నుంచి వేలాదిమంది పిల్లల్ని మాస్కో తమ దేశానికి తీసుకెళ్లింది. వారిని మాకు వెనక్కి ఇప్పించడంలో మోదీ సహాయం చేయాలి’ అని కోరారు.

Similar News

News October 28, 2024

DANGER ALERT: పొద్దున, సాయంత్రం బయటకెళ్తున్నారా..

image

ఎయిర్ పొల్యూషన్‌తో పెద్దలకే కాదు యువతకూ ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పరిశోధకులు. గాల్లో పెరిగిన నైట్రోజన్ డైయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి అణువులతో లంగ్స్, హార్ట్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. హృదయ స్పందన, లయ దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందన్నారు. AP, TGలో AQI లెవల్స్ పెరుగుతుండటంతో పొద్దున, సాయంత్రం ఆఫీస్ పనిపై బయటకెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

News October 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్సీ

image

TG: డిస్కంల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50కి పెంచేందుకు ప్రతిపాదనలు చేయగా నిరాకరించింది. ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిలోనూ పెంచట్లేదని పేర్కొంది. సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

News October 28, 2024

ధరల భారంతో నష్టాల్లో FMCG మార్కెట్!

image

Nifty FMCG స్టాక్స్ నేల‌చూపులు చూస్తున్నాయి. గ‌త ఆరేళ్ల‌లో లేని విధంగా Octలో ఇండెక్స్ 9.6% న‌ష్ట‌పోయింది. Sep Q2 ఫ‌లితాలు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళన నెల‌కొంది. క‌మోడిటీల‌ అధిక ధ‌ర‌ల‌తో అర్బ‌న్ ప్రాంతాల్లో అమ్మ‌కాలు తగ్గ‌డం ఈ ప‌రిశ్ర‌మ మీద భారం మోపిన‌ట్టు తెలుస్తోంది. భ‌విష్య‌త్తు ఫ‌లితాల‌పై కంపెనీలు ఆచితూచి మాట్లాడుతుండ‌డం కూడా సెంటిమెంట్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చిన‌ట్టైంది.