News October 28, 2024

ఫామ్ హౌస్ పార్టీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాలను పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు హైకోర్టు 2 రోజులు సమయం ఇచ్చింది. కాగా KTR బావమరిది అనే కారణంతోనే రాజ్‌ను టార్గెట్ చేశారని ఆయన తరుఫున న్యాయవాది మయూర్ రెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చేయలేదని AAG ఇమ్రాన్ కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామన్నారు.

Similar News

News October 28, 2024

అమితాబ్‌కి జీవితాంతం రుణపడి ఉంటాను: చిరంజీవి

image

ANR నేషనల్ అవార్డ్ ఈవెంట్‌లో అమితాబ్ బచ్చన్‌ను తన గురువు, స్ఫూర్తిగా మెగాస్టార్ చిరంజీవి అభివర్ణించారు. ‘మా కుటుంబంలో ఏ మంచి జరిగినా మెసేజ్ చేసే మొదటి వ్యక్తి ఆయన. నాకు పద్మభూషణ్ వచ్చినప్పుడు చీఫ్ గెస్టుగా వచ్చిన ఆయన నన్ను కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు. ఆయన భారతీయ సినిమాకే బాద్‌షా. ‘సైరా’లో రోల్‌కు ఏమీ తీసుకోలేదు. అందరి ముందూ చెబుతున్నా సార్. నేను మీకు జీవితాంతం రుణపడిపోయాను’ అని పేర్కొన్నారు.

News October 28, 2024

DANGER ALERT: పొద్దున, సాయంత్రం బయటకెళ్తున్నారా..

image

ఎయిర్ పొల్యూషన్‌తో పెద్దలకే కాదు యువతకూ ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పరిశోధకులు. గాల్లో పెరిగిన నైట్రోజన్ డైయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి అణువులతో లంగ్స్, హార్ట్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. హృదయ స్పందన, లయ దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందన్నారు. AP, TGలో AQI లెవల్స్ పెరుగుతుండటంతో పొద్దున, సాయంత్రం ఆఫీస్ పనిపై బయటకెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

News October 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్సీ

image

TG: డిస్కంల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50కి పెంచేందుకు ప్రతిపాదనలు చేయగా నిరాకరించింది. ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిలోనూ పెంచట్లేదని పేర్కొంది. సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.