News October 28, 2024
HAIR HEALTH: ఇవి పాటిస్తే సొగసైన జుట్టు మీ సొంతం

* జుట్టుకు ప్రొటీనే బలం. అందుకు మాంసం, ఫిష్, బీన్స్, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు తీసుకోవాలి * జుట్టు రాలొద్దంటే జింక్ ఉండే వెజిటెబుల్స్, ఫ్రూట్స్, ఆకు కూరలు, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలి * మాడుపై ఫొలిసిల్స్, సెబాస్టియన్ గ్రంథులకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. అప్పుడే జుట్టు రాలడం తగ్గుతుంది * మీ హెయిర్‌టైప్ డ్రై, ఆయిలీనా తెలుసుకోవాలి * తగిన షాంపూ, కండిషనర్ సరైన మోతాదుల్లోనే వాడాలి.
Similar News
News March 1, 2026
నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో ఉద్యోగాలు

నార్త్ ఈస్ట్రర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 11పోస్టుల భర్తీకి మార్చి 5, 6తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech రిమోట్ సెన్సింగ్& GIS, జియోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్, MS, BE/BTech, NET/ GATE అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ సైంటిస్ట్‌కు నెలకు రూ.56,100, JRFకు రూ. 37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nesac.gov.in
News March 1, 2026
త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.
News March 1, 2026
ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.


