News October 28, 2024

సచివాలయ భద్రతా సిబ్బందికి CSO వార్నింగ్

image

TG: సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(CSO) హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని ప్రకటనలో తెలిపారు. పోలీసులను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకమైన పోస్టులను లైక్, షేర్ చేయవద్దన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 28, 2024

ప్యాసింజర్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు

image

హరియాణాలో రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్యాసింజర్ రైలులో పేలుడు కలకలం రేపింది. పేలుడుకు మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సంప్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికులు రైలులో పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను తీసుకువెళ్లడంతో ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

News October 28, 2024

జగన్‌పై షర్మిల భర్త హాట్ కామెంట్స్

image

AP: జగన్‌కు మద్దతుగా పాదయాత్ర చేయాలని షర్మిలను భారతీనే అడిగారని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘యాత్ర సందర్భంగా ఆమె పార్టీని ఎత్తుకుపోతోందని జగన్‌తో సజ్జల చెప్పారు. జగన్‌కు అప్పటి నుంచే అభద్రతాభావం మొదలైంది. మధ్యలో చాలామంది చిచ్చులు పెట్టారు. TGలో పార్టీ పెట్టాలని షర్మిలను PK అడిగారు. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని, KCRతో ఇబ్బంది అవుతుందని జగన్ వద్దన్నారు’ అని అనిల్ చెప్పారు.

News October 28, 2024

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

జేఈఈ మెయిన్స్ 2025-26కు షెడ్యూల్‌ను NTA విడుదల చేసింది. రెండు సెషన్స్‌గా పరీక్షలు జరగనున్నాయి. తొలి సెషన్ దరఖాస్తులకు నవంబర్ 22 వరకు గడువు ఉంది. జనవరి 22 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 12లోపు ఫలితాలు రానున్నాయి. రెండో సెషన్ దరఖాస్తులు ఫిబ్రవరిలో స్వీకరించనుండగా, ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి.