News October 28, 2024
రాష్ట్రాన్ని ప్రైవేట్ పరం చేయనున్న చంద్రబాబు: కాకాణి

రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగిస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని రామాయపట్నం, మచిలీపట్నం పోర్టును కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిధులు లేవని సాకు చెబుతూ సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.
Similar News
News July 7, 2025
స్వర్ణాల చెరువుకు క్యూ కట్టిన భక్తులు

నెల్లూరులో రొట్టెల పండగ ఘనంగా జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రెండో రోజు స్వర్ణాల ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. పలువురు రొట్టెలను మార్చుకున్నారు. తర్వాత బారా షాహిద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రొట్టెల పండగలో ముఖ్యమైన గంధోత్సవం ఇవాళ రాత్రికి జరగనుంది. మీరూ రొట్టెల పండగకు వెళ్లారా? ఏ రొట్టె తీసుకున్నారు? ఏ రొట్టె ఇచ్చారు? కామెంట్ చేయండి.
News July 7, 2025
VR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

నెల్లూరులోని VR మున్సిపల్ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఎంతో చరిత్ర గల ఈ పాఠశాలను ఇటీవల మంత్రి నారాయణ పున:నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాఠశాల పున:నిర్మాణంలో నారాయణ కూతురు షరిణి కీలక పాత్ర పోషించారు. మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.
News July 7, 2025
నెల్లూరు: ప్రార్థనల అనంతరం మీ దారెటు.?

నెల్లూరులో బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ప్రారంభమైన విషయం తెలిసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు నెల్లూరుకు చేరుకున్నారు. ప్రతి ఏడాది ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులు జిల్లాలోని పలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్తారు. వాటిలో ముఖ్యమైనవి:
☞ ఏఎస్ పేట దర్గా ☞ కసుమూరు దర్గా ☞ సోమశిల ప్రాజెక్టు
☞ మైపాడు బీచ్ ☞ పెంచలకోన ☞ కండలేరు రిజర్వాయర్ ☞ ఉదయగిరి కోట
మీరు ఎక్కడికి వెళ్తున్నారు.?