News October 28, 2024
కావలి: ఊయలలో బాలుడు మిస్సింగ్

కావలి పట్టణంలోని వెంగళరావు నగర్‌లో 15 నెలల వయసు గల తేజ అనే బాలుడిని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు అపహరించికెళ్లారు. బాలుడి తల్లి పల్లపు రాజేశ్వరి బాబుని ఊయలలో పడుకోబెట్టి స్నానానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. బాలుడు మిస్సింగ్‌పై కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు.
Similar News
News January 13, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.
News January 12, 2026
నెల్లూరు: మన నిమ్మకు.. ఉత్తరాదిన ధీమా.!

నెల్లూరు జిల్లా నుంచి దేశంలో పలు ప్రాంతాలకు అత్యధికంగా నిమ్మ పంట ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, UPలకు సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్ TN, కర్ణాటక, కేరళకు వెళ్తున్నాయి. 23-24లో 50628 క్వింటాళ్లు (రూ.14.99 cr), 24-25లో 36579 క్వింటాళ్లు (రూ.14.73cr), 25-26లో 21631 క్వింటాళ్లు (రూ.6.16cr) విక్రయాలు జరిగాయి. ప్రస్తుత కలెక్టర్ చొరవతో నిమ్మ KG రూ.22 ఉందని రైతులన్నారు.
News January 12, 2026
నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.


