News October 28, 2024
చిట్టి నాయుడి చిల్లర డ్రామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి: MLC

ఖమ్మం: చిట్టి నాయుడు చిల్లర డ్రామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి ప్రజలు మోసపోయారని సోమవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన చెప్పారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయడం చేతకాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారని విమర్శించారు.
Similar News
News December 28, 2025
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: అర్బన్ ఏవో

కామేపల్లి మండలం బాసిత్‌నగర్ రైతులకు సరఫరా అయిన నకిలీ విత్తనాల వ్యవహారంపై అధికారులు స్పందించారు. దీనిపై ఖమ్మం అర్బన్ ఏవో కిషోర్ వివరణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, అధికారులు పంటను సందర్శించి నివేదిక అందజేస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా నకిలీ విత్తనాలు విక్రయించిన సంబంధిత దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
News December 28, 2025
ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో, వెనుక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.
News December 27, 2025
అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.


