News October 28, 2024
రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ
TG: * నల్గొండ- ఐలా త్రిపాఠి, * రంగారెడ్డి-నారాయణ రెడ్డి, * యాదాద్రి-హనుమంతరావు, * పురపాలక శాఖ డైరెక్టర్-TK శ్రీదేవి, * CCLA ప్రాజెక్టు డైరెక్టర్- మంద మకరందు, * పర్యాటక శాఖ-హనుమంతు, * I&PR ప్రత్యేక కమిషనర్-హరీశ్, * R&R భూసేకరణ కమిషనర్-వినయ్ కృష్ణారెడ్డి, * వాణిజ్య పన్నుల అదనపు శాఖ- నిఖిల్ చక్రవర్తి, * డెయిరీ కార్పోరేషన్ ఎండీ-చంద్రశేఖర్ రెడ్డి, * నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్-దిలీప్ కుమార్
Similar News
News October 31, 2024
PLEASE CHECK.. ఈ జాబితాలో మీ పేరు ఉందా?
APలో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2.03 కోట్ల మంది పురుషులు, 2.10 కోట్ల మంది మహిళలు, థర్డ్ జెండర్ 3394 మంది ఉన్నారు. ఈ ఓటరు జాబితాపై నవంబర్ 28 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం జనవరి 6న తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <
News October 31, 2024
Investing: ఈ వయసు వారే అత్యధికం
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారిలో 30 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరు 2018లో 22.9% ఉండగా Sep, 2024 నాటికి వారి సంఖ్య 40 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ ట్రెండ్ వెల్త్ క్రియేషన్‌పై ఆర్థిక అవగాహనతో పెట్టుబడులు పెట్టాలన్నయువత ఉత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, 30 ఏళ్లు పైబడిన వారిలో ఇన్వెస్టింగ్ ధోరణి క్రమంగా తగ్గుతున్నట్టు NSE నివేదిక వెల్లడించింది.
News October 31, 2024
తిరోగమనంలో విద్యారంగం: YCP
ఏపీలో సర్కార్ విద్యకి CM చంద్రబాబు మంగళం పాడారని YCP మండిపడింది. దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంది. ‘ఇంగ్లీషు మీడియం, CBSE, టోఫెల్ రద్దు. తల్లికి వందనమంటూ అమ్మఒడికి ఎగనామం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి తిలోదకాలు. అధ్వాన్నంగా మారిన స్కూళ్లు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆస్పత్రిపాలు. కూటమి 5 నెలల పాలనలో తిరోగమనంలో విద్యారంగం’ అని Xలో విమర్శలు గుప్పించింది.