News October 28, 2024

విశాఖ: విమ్స్‌లో న్యూరో వైద్య శిబిరం

image

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా విమ్స్‌లో బుధవారం ఉచిత న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, పక్షవాతం, చిన్నపిల్లలకు మానసిక వైకల్యం తదితర రోగాలను నిర్ధారించే వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. >Share it

Similar News

News September 20, 2025

కౌన్సిల్ తీర్మానం మేరకే ఆక్రమణలు తొలగింపు: జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా ఫుడ్ కోర్ట్ తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం తెలిపారు. ఫుడ్ కోర్ట్‌లో 160 దుకాణాలు అనధికారకంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు. 2023లోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు కౌన్సిల్ తీర్మానించదన్నారు. మరళ 2025 ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యుల అంగీకారంతో తీర్మానం జరిగిందన్నారు.

News September 19, 2025

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో 1053 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ లంగ్స్’ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. జోన్-1లో 40 ఆక్రమణలు, జోన్-2లో 86, జోన్ -3లో 71, జోన్-4లో 11, జోన్-5లో 58, జోన్-6లో 110, జోన్- 7లో 52, జోన్-8లో 40 ఆక్రమణలు తొలగించారు. శుక్రవారం ఒక్కరోజే 529 ఆక్రమణలు తొలగించారు.

News September 19, 2025

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన మేయర్ బృందం

image

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.