News October 28, 2024
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్మోహన్(47) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. రామ్మోహన్ బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డిలోని జడ్పీ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తూ, కళ్యాణదుర్గంలో నివాసముంటున్నారు. స్నానానికి వెళ్లే సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామ్మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
Similar News
News August 31, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

అనంతపురంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News August 31, 2025
గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాం: ఎస్పీ

అనంతపురంలో ఆదివారం జరిగే గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేలా పటిష్ఠ పోలీసు బందోబస్తు చేపట్టామని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు.. మరీ ముఖ్యంగా యువత పోలీసులతో సహకరించాలని కోరారు. ఆనందంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో అనంతపురం పోలీస్ పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News August 31, 2025
నార్పల: యువతికి వేధింపులు..అడ్డొచ్చిన తండ్రిపై దాడి

నార్పలలోని సూర్య నగర్ కాలనీలో నివాసమున్న మల్లారెడ్డి కుమారుడు హేమేశ్ కుమార్ అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమించమని వేధించేవాడు. ఇదే క్రమంలో శనివారం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లగా తండ్రి అడ్డుకున్నాడు. దీంతో హేమేశ్ యువతి తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారు.