News October 28, 2024
నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి: స్పీకర్ అయ్యన్న

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఇన్ ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం జరిగింది. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయిని అరికట్టాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. ఆన్ రాక్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఒప్పందాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరీకి చెందిన భారీ వాహనాలు రాకపోకలను నియంత్రించాలన్నారు.
Similar News
News March 13, 2026
విశాఖ: షాపుల ముందు చెత్త వేస్తున్నారా? రూ.5000 జరిమానా తప్పదు!

వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం 20వ వార్డులో పర్యటించిన ఆయన, రోడ్లపై వ్యర్థాలు వేసిన బ్లింకిట్ అవుట్‌లెట్‌కు రూ.10 వేలు, పాన్ షాపునకు రూ.5 వేల జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించే వాణిజ్య సముదాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్లాప్ వాహనాలు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు
News March 13, 2026
విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.
News March 12, 2026
మధురవాడ: ఉరివేసుకుని యువకుడు మృతి!

మధురవాడ గణేష్ నగర్‌లో తాడి ప్రవీణ్ కుమార్ (27) అనే యువకుడు మనస్థాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చింతపల్లికి చెందిన ప్రవీణ్ గత ఆరేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తూ, స్థానిక టెలిఫోన్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


