News October 28, 2024
ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలి: ఎస్పీ

ర్యాగింగ్ భూతానికి మెడికల్ విద్యార్థులు దూరంగా ఉండాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ మాణిక్య రావు అధ్యక్షతన ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ జగదీశ్, న్యాయసేవ సాధన కార్యదర్శి శివ ప్రసాద్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కళాశాలలో జూనియర్, సీనియర్ భేదం లేకుండా సోదర భావంతో ఉండాలని సూచించారు.
Similar News
News January 16, 2026
అనంత: కొండెక్కిన కోడి ధరలు

ఫర్వాట సందర్భంగా గుత్తిలో చికెన్, మటన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కేజీ చికెన్ ధర రూ.270, స్కిన్ లెస్ రూ.290 పలుకుతోంది. మరోపక్క కేజీ మటన్ రూ. 750 ఉండగా.. ఒక్కసారిగా రూ.50 పెరిగి రూ.800 కి విక్రయిస్తున్నట్లు మటన్ షాప్ నిర్వాహకుడు ఖురేషి అన్వర్ తెలిపారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.270 ఉండగా, అనంతపురంలో రూ.260-270 ఉంది.
News January 14, 2026
గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు

గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టే విధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. అనంతపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలలో ఎస్పీ జగదీశ్ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించి గాలిపటాలు ఎగురవేశారు. ఎస్పీ గుండాట ఆడి, ఉట్టి కొట్టారు.
News January 14, 2026
పామిడిలో పండగపూట విషాదం

పామిడిలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీకి చెందిన కువకుడు ద్వారక గజిని పట్టణ శివారులోని 44 హైవేపై రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


