News October 28, 2024

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

జేఈఈ మెయిన్స్ 2025-26కు షెడ్యూల్‌ను NTA విడుదల చేసింది. రెండు సెషన్స్‌గా పరీక్షలు జరగనున్నాయి. తొలి సెషన్ దరఖాస్తులకు నవంబర్ 22 వరకు గడువు ఉంది. జనవరి 22 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 12లోపు ఫలితాలు రానున్నాయి. రెండో సెషన్ దరఖాస్తులు ఫిబ్రవరిలో స్వీకరించనుండగా, ఏప్రిల్‌లో పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News October 29, 2024

విద్యుత్ ఛార్జీల పెంపునకు వైసీపీ విధానాలే కారణం: అనగాని

image

AP: వైసీపీ నాయకులు కేసులు, బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లేవారని, సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ‘రీసర్వే పూర్తయ్యాక జిల్లాల పునర్విభజనపై దృష్టిసారిస్తాం. పార్టీలో అర్హులైన వారికి త్వరలో నామినేటెడ్ పదవులు వస్తాయి’ అని తెలిపారు.

News October 29, 2024

సుమతీ నీతి పద్యం.. తాత్పర్యం

image

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
తాత్పర్యం: పాముకు తలలో విషం ఉంటుంది. తేలుకు తోకలో విషం ఉంటుంది. కానీ దుర్మార్గుడైన మనిషికి తల, పాదం అనే తేడా లేకుండా శరీరమంతా విషం ఉంటుంది.

News October 29, 2024

స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు మద్దతు: అదానీ గ్రూప్

image

AP: సీఎం చంద్రబాబుతో అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ MD రాజేష్‌ అదానీ, అదానీ పోర్ట్స్‌ సెజ్‌ MD కరణ్‌ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఓడరేవులు, మైనింగ్‌, రింగ్‌రోడ్డు, IT, AI, టూరిజం రంగాల్లో గల అవకాశాలను సీఎంకు వివరించారు. అమరావతి పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని, స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.