News October 28, 2024
ప్యాసింజర్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు
హరియాణాలో రోహ్‌తక్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్యాసింజర్ రైలులో పేలుడు కలకలం రేపింది. పేలుడుకు మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సంప్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికులు రైలులో పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను తీసుకువెళ్లడంతో ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Similar News
News January 3, 2025
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణను మారుస్తాం: భట్టి
TG: రాష్ట్రంలో 2030 నాటికి రెండు వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆస్ట్రేలియా-ఇండియా మినరల్స్ హబ్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఫ్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెడతామని భట్టి చెప్పారు. మరోవైపు దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర అని తెలిపారు.
News January 3, 2025
CMR బాత్ రూం వీడియోల కేసు.. కాలేజీకి 3 రోజులు సెలవులు
TG: మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 12 ఫోన్లలో డేటానూ కాప్స్ చెక్ చేస్తున్నారు. అటు దర్యాప్తునకు ఇబ్బంది లేకుండా 3 రోజుల పాటు CMR కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది.
News January 3, 2025
అధికారులు సీరియస్‌గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని
APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్‌గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.