News October 29, 2024
పేరులోనే ‘వావ్’.. చూస్తే షాక్
TG: మోమోస్ తిని మహిళ <<14473401>>మృతి<<>> చెందిన ఘటనపై GHMC దర్యాప్తు చేపట్టింది. చింతల్‌బస్తీలోని ‘వావ్ హాట్ మోమోస్’ షాపులో వాటిని తయారుచేసినట్లు గుర్తించి తనిఖీలు చేపట్టింది. అయితే అక్కడి పరిసరాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఏ మాత్రం పరిశుభ్రత లేని ప్రదేశంలో మోమోస్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో టెస్టుల కోసం ఫుడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.
Similar News
News October 31, 2024
TTD ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం.. స్పందించిన ప్రభుత్వం
AP: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫేక్ అకౌంట్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కాగా నిన్న 24 మంది సభ్యులతో కూడిన నూతన టీటీడీ బోర్డును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
News October 31, 2024
రూ.21కోట్లకు పూరన్ రిటెన్షన్!
నికోలస్ పూరన్ IPL 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో టాప్ రిటెన్షన్ స్థానాన్ని పొందినట్లు వార్తలొస్తున్నాయి. పూరన్‌ను ఏకంగా రూ.21 కోట్లకు రిటెయిన్ చేసుకుందని, అతనికిదే కెరీర్లో అత్యధికమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పూరన్ కోల్‌కతాలో LSG ఓనర్ సంజీవ్ గోయెంకాతో సమావేశమైన తర్వాత రూ.18 కోట్లకు బదులు రూ.21 కోట్లు పొందినట్లు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్ల ధరల్లోనూ స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం.
News October 31, 2024
‘ఫ్రీ బస్’పై కర్ణాటక సర్కార్ పునరాలోచన!
కర్ణాటక ప్రభుత్వం శక్తి స్కీమ్‌లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలు డబ్బు చెల్లించి ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఈమెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు.