News October 29, 2024

HYD: లైసెన్స్ లేకుండానే.. మోమోస్ తయారీ..!

image

HYD బంజారాహిల్స్ నంది నగర్‌లో మోమోస్ తిని ఒకరు మృతి చెందడంతో పాటు, మరో 20 మంది తీవ్ర అనారోగ్యం పాలైనట్లు భారీ ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.వెంటనే GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు మోమోస్ దుకాణాన్ని ట్రేస్ చేయాగా.. ఖైరతాబాద్ చింతల బస్తీలోని వావ్ హాట్ మోమోస్/ఢిల్లీ హాట్ మోమోస్ పేరిట ఉందని తేలింది.కానీ..FSSAI లైసెన్స్ లేదని,అపరిశుభ్ర ప్రాంతంలో నడిపిస్తున్నట్లు గుర్తించారు.

Similar News

News November 5, 2024

HYD: రాహుల్ గాంధీ బావర్చీకి రావాలని డిమాండ్

image

HYDలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్‌ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్, అశోక్‌నగర్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని బావర్చీలో కుర్చీ వేసి, ప్లేట్‌‌లో బిర్యానీ వడ్డించారు. బిర్యానీ చల్లబడకముందే రావాలని BRS సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచించారు. పలువురు నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీ రావాలని కోరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

News November 5, 2024

HYD: ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు కేటీఆర్

image

నేడు ఆటో డ్రైవర్లు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహించనున్నారు. కాగా ఈ మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. అయితే ఈరోజు నిర్వహించే మహా ధర్నాను అన్ని వాహన సంఘాలతో కలిసి విజయవంతం చేస్తామని ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం చేసింది.

News November 5, 2024

HYD: మహిళపై ముగ్గురి అత్యాచారం

image

అమీర్‌పేట్: మధురానగర్ PS పరిధిలో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇళ్లలో పనికి వెళ్లే ఓ మహిళ నిన్న కొండాపూర్‌లో పనికెళ్లి తిరిగొస్తుండగా ఆటోలో ముగ్గురు వచ్చి తమ గదిలో బట్టలు ఉతకాలని చెప్పి ఆమెను తీసుకెళ్లి రూమ్‌లో బంధించారు. నోట్లో బట్టలు కుక్కి, తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. తప్పించుకున్న ఆమె దుస్తులు లేకుండా బయటకు రాగా పక్కింటి మహిళ గమనించి నైటీ ఇచ్చారు. కేసు నమోదైంది.