News October 29, 2024

తూ.గో. జిల్లాలో పకడ్బందీగా నూతన మద్యం పాలసీ

image

తూర్పుగోదావరి జిల్లాలో పకడ్బందీగా నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సిహెచ్ లావణ్య తెలిపారు. రాజమహేంద్రవరంలో సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 125 మద్యం షాపులను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ షాపులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుందని తెలిపారు.

Similar News

News January 17, 2026

ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రాజమండ్రి ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎన్జీవో సంఘ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.

News January 17, 2026

రాజమండ్రి: పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శిబిరాలు

image

తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 19 నుంచి 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. పశువుల ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.