News October 29, 2024
సోషల్ మీడియాలో మీ వివరాలు షేర్ చేయవద్దు: ప్రకాశం ఎస్పీ
సోషల్ మీడియాలో ప్రజలు తమ ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి వివరాలు, ఇతర విలువైన వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకూడదని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. దీని వలన సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.
Similar News
News November 24, 2024
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్
పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా బోధనతో పాటు పారిశుధ్యం పైన కూడా దృష్టి సాధించాలన్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్, గణితంలో పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు.
News November 24, 2024
IPL వేలంలో మన ప్రకాశం కుర్రాడు.!
IPL మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన మనీశ్ రెడ్డి రూ.30 లక్షల బేస్ ఫ్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో మన ప్రకాశం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 24, 2024
సంతనూతలపాడు ZPHSలో కలెక్టర్ తనిఖీలు
సంతనూతలపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లల్లో అభ్యాస శక్తిని పెంపొందించాలని సూచించారు.