News October 29, 2024

నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ నవంబర్ 1న ఉదయం 6 గంటలకే మొదలు కావాలని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,85,004 పెన్షన్లు ఉండగా, అందుకు సంబంధించి రూ.120,09,75,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంకులలో నగదు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈనెల 30వ తేదీనే బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.

Similar News

News March 4, 2026

అనంతపురంలో పడిపోయిన ధరలు

image

చీనీ, టమాటా ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.25,000, కనిష్ఠంగా రూ.8 వేల ధర పలికింది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాటా బండిలో క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.8 వేలు, కనిష్ఠంగా రూ.4 వేల ప్రకారం ధర పలికింది.

News March 3, 2026

అనంత: జాగ్రత్త.. ఇది డేంజర్ స్పాట్

image

కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి వద్ద హైవే మలుపు డేంజర్ స్పాట్‌గా మారింది. ఇటీవల అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 15 రోజుల క్రితం 2 బైకులు డీకొన్న ఘటనలో ఒకరు మరణించారు. నెల రోజుల క్రితం అక్కడే ట్రాక్టర్, కారు డీకొన్నాయి. మలుపు ప్రమాదకరంగా మారడంతోనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

News March 2, 2026

ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.