News October 29, 2024

అక్టోబర్ 29: చరిత్రలో ఈరోజు

image

✒ 1899: కవి, సమరయోధుడు నాయని సుబ్బారావు జననం
✒ 1940: రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మరణం
✒ 1961: నిర్మాత, నటుడు నాగబాబు జననం
✒ 1971: ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ జననం
✒ 1976: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ జననం
✒ 1985: బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగర్ జననం
✒ 1986: హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ జననం

Similar News

News October 29, 2024

Q2లో ఎయిర్‌టెల్ లాభం రూ.3,593 కోట్లు

image

సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2)లో భారతీ ఎయిర్‌టెల్ రూ.3,593 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1,341 కోట్ల లాభంతో పోలిస్తే 168 శాతం పెరుగుదల నమోదైంది. Q2లో ఆపరేషన్స్ ద్వారా కంపెనీ రెవెన్యూ రూ.41,473 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ నెట్‌వర్క్‌ విస్తృతిపై మరిన్ని పెట్టుబడులు పెడతామని కంపెనీ ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు.

News October 29, 2024

CBI డీఐజీగా వెంకటసుబ్బారెడ్డి

image

సీబీఐ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ వెంకటసుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది. 2007 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఈయన స్వరాష్ట్రం ఏపీ. ప్రస్తుతం షిల్లాంగ్‌గా సీఐడీ డీఐజీగా పనిచేస్తున్నారు. వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.

News October 29, 2024

బీఫార్మసీ: తొలి విడతలో 8,453 సీట్లు భర్తీ

image

TG: బీఫార్మసీలో 8,845 సీట్లకుగాను తొలి విడత కౌన్సెలింగ్‌లో 8,453 సీట్లు(95 శాతం) భర్తీ అయ్యాయి. ఫార్మాడీలో 1,648 సీట్లకు 1,627, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 122 సీట్లకు 117, బయో టెక్నాలజీలో 181, బయోమెడికల్‌లో 58 సీట్లు భర్తీ అయ్యాయి. అన్ని కోర్సుల్లో కలిపి 418 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొందిన వారు రేపటి లోగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.