News October 29, 2024
కిర్‌స్టన్‌పై వేటు అందుకే: పాక్ మాజీ బ్యాటర్

పాక్ క్రికెట్ కోచ్ బాధ్యతలకు గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశ మాజీ బ్యాటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం చాలా శక్తిమంతమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన నిర్ణయాల్ని ఎవరు వ్యతిరేకించినా ఉద్యోగాలు పోతాయి. రిజ్వాన్‌ను టీ20, వన్డేలకు కెప్టెన్‌గా నియమించడాన్ని గ్యారీ వ్యతిరేకించారు. అందుకే రిజైన్ చేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(<
News January 19, 2026
అమెనోరియా సమస్యకు కారణమిదే!

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.
News January 19, 2026
20 ఏళ్లుగా చెబుతున్నా వినలేదు.. ఇక టైమ్ వచ్చింది: ట్రంప్

గ్రీన్‌లాండ్ విషయంలో డెన్మార్క్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ‘రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు ముప్పు ఉందని 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు నాటో చెబుతోంది. కానీ ఈ విషయంలో డెన్మార్క్ ఏమీ చేయలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. అది జరిగి తీరుతుంది’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్‌లాండ్ తమకు చాలా ముఖ్యమని, <<18784880>>అవసరమైతే సైన్యాన్ని<<>> వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం తెలిసిందే.


