News October 29, 2024
మీ బ్యాంక్ అకౌంట్లను ఎవరికీ అమ్మొద్దు: కేంద్రం

నేరపూరిత అక్రమార్జనకు పలువురు నకిలీ బ్యాంకు ఖాతాలను వాడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. AP, గుజరాత్ పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడినట్లు తెలిపింది. ప్రజలెవరూ తమ బ్యాంకు అకౌంట్లను ఇతరులకు అమ్మడం/అద్దెకు ఇవ్వొద్దని సూచించింది. ఆ ఖాతాల్లో అక్రమ నగదు చేరితే అరెస్టుతోపాటు చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది హెచ్చరించింది. ఏదైనా సమస్య వస్తే 1930 లేదా www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలంది.
Similar News
News October 29, 2024
400 ఎకరాల తాకట్టుకు ప్రభుత్వం సిద్ధం

TG: HYDలో ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న కోకాపేట, రాయదుర్గంలో ₹20వేల కోట్ల విలువైన 400 ఎకరాలను ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూలధనం, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ₹10వేల కోట్ల రుణం కోసం పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు గ్యారంటీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది.
News October 29, 2024
FLASH: మూడో టెస్టుకూ విలియమ్సన్ దూరం

న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగే మూడో టెస్టుకూ దూరమయ్యారు. ఇప్పటికే గాయం వల్ల తొలి రెండు టెస్టులు ఆడలేకపోయిన కేన్ మూడో టెస్టుకూ అందుబాటులో ఉండటం లేదు. అయితే బ్యాటింగ్ పరంగా కేన్ లేకపోవడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ అయినప్పటికీ ఆ జట్టు ఇప్పటికే భారత్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. నామమాత్రపు మ్యాచ్ NOV 1న ప్రారంభమవుతుంది.
News October 29, 2024
ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు

TG: ఇళ్లలో కరెంట్ అసలేం వాడుకోకపోయినా గతంలో కనీస ఛార్జీ కింద రూ.30 చెల్లించాల్సి వచ్చేది. దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది గృహజ్యోతికి అర్హులు కాని వారికి ఉపయోగపడనుంది. గృహేతర/వాణిజ్య పరంగా 50 యూనిట్లలోపు కరెంట్ వాడే వారికి ఫిక్స్‌డ్ ఛార్జీలను కిలోవాట్‌కు రూ.60 నుంచి రూ.30 తగ్గించింది. ఇదే కేటగిరీలో కనీస ఎనర్జీ ఛార్జీలను సింగిల్ ఫేజ్‌కు రూ.65-50కి, త్రీఫేజ్‌కు రూ.200-100కు తగ్గించింది.